మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా. రేనాటి సూర్యుడు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరుడి కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి తెచ్చుకున్న సైరా సినిమా ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అన్నీ భాషల్లో కలిపి 100 కోట్లను రాబట్టింది. మొదటి రోజు ఉన్న జోష్ ఈ తర్వాతి రోజుల్లో కనిపించలేదని కొన్ని మాటలు వినిపించాయి.
నిజానికి సైరా మంగళవారం రిలీజ్ అయ్యింది, లాంగ్ వీకెండ్ ఉండడంతో వర్కింగ్ డేస్ ఉన్న సమయంలో సైరా కాస్త స్లో అయ్యింది. వర్కింగ్ డేస్ లో స్లో అయ్యింది కదా అని సినిమా పని అయిపొయింది అంటే ఎలా… అక్కడ ఉన్నది మెగాస్టార్, మూడు దశాబ్దాల వెండితెర ఇలవేల్పుగా వెలిగిన హీరో. తన రికార్డులు తానే బ్రేక్ చేసుకున్న చరిత్ర ఉన్న చిరంజీవి సినిమా అంత ఈజీగా చేతులేలా ఎత్తేస్తుంది. వీకెండ్ స్టార్ట్ అవగానే సైరా మళ్లీ పుంజుకుంది. ఇదే రెండో రోజా అనే స్థాయిలో పుంజుకున్న సైరా సినిమా ఓవర్సీస్లో 2 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. గతంలో ఖైదీ 150 సినిమాతో 2 మిలియన్ మార్క్ టచ్ చేసిన చిరు, సైరాతో మరోసారి ఆ మార్క్ ని క్రాస్ చేసి యంగ్ హీరోలకి కూడా పోటీ ఇస్తున్నాడు. పండగ సెలవలు ఇంకా మూడు రోజులు ఉన్నాయి కాబట్టి సైరా ఈ 3 డేస్ లో మంచి గ్రోత్ చూసి 3 మిలియన్ మార్క్ కూడా టచ్ చేస్తుందేమో చూద్దాం.
Read: అక్టోబర్ 8 నుంచి కొత్త సైరాని చూస్తారు