రెండేళ్ల తర్వాత మళ్లీ కలవనున్న బాహుబలి టీం

తెలుగు సినిమా గురించి చెప్పాలి అంటే శివకి ముందు శివకి తర్వాత అంటారు. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి చెప్పాలి అంటే బాహుబలి తర్వాత బాహుబలి ముందు అనాలి. ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కి పాన్ ఇండియా రిలీజ్ అయ్యి బాహుబలి సంచలనం సృష్టించింది. జక్కన్న చెక్కిన ఈ మహాకావ్యం మన జనరేషన్ క్లాసిక్స్ లో ఒకటి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. భారీ బడ్జట్ తో అయిదేళ్ల పాటు రూపొందిన ఈ బాహుబలి ఫ్రాంచైజ్ లో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లు పాన్ ఇండియా వైడ్ పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నారు.

bahubali reunion

రెండుళ్లుగా బాహుబలి రికార్డులని టచ్ చేయాలని తెలుగు తమిళ హిందీ భాషల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా బాహుబలిని టచ్ చేయలేకపోయాయి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బాహుబలి టీం మళ్లీ కలవబోతోంది. లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ ఉంది, ఈ స్క్రీనింగ్ కి చిత్ర యూనిట్ అంతా వెళ్లనున్నారు. అక్టోబర్ 19న జరగనున్న ఈ స్క్రీనింగ్ తర్వాత ప్రభాస్, రానా, అనుష్కలు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. కీరవాణి ఆల్బర్ట్ హాల్ లో లైవ్ కాన్సర్ట్ కూడా ఇవ్వనున్నారు.

Read: విజయ్ న్యూ లుక్ వెనక డాషింగ్ డైరెక్టర్