దీపావళికి సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్

తన బెంచ్ మార్క్ మూవీ మహర్షితో మంచి హిట్ అందుకున్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న మహేశ్, ఇందులో మేజర్ అజయ్ పాత్రలో కనిపించనున్నాడు. కెరీర్ లో మొదటిసారి ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్న మహేశ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి చిన్న గ్లిమ్ప్స్ బయటకి వచ్చి ఘట్టమనేని అభిమానులకి కొత్త కిక్ ఇచ్చింది. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా, ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేసిన పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

sarileru neekevvaru teaser date

ఇప్పుడు దసరా కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి కొత్త పోస్టర్ బయటకి రానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ బయటకి రాబోతోందని తెలుస్తోంది. దీపావళి కానుకగా అక్టోబ‌ర్ 27న సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ చేసి సినిమా ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు పక్కన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు దశాబ్దమున్నర తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది.

sarileru neekevvaru dasara poster

Read: బిజీనే కానీ సూపర్ స్టార్ కోసం ఒప్పుకున్నారు…