రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మెగాస్టార్ నటించిన సైరా సినిమాపై వివాదాలు ముదురుతూనే ఉన్నాయి, వరుసగా ఎదో ఒక వివాదం జరుగుతూనే ఉంది అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా అని కొందరికి అనుమానాలు ఉండేవి. ముఖ్యంగా కోర్ట్ సైరా విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందా అని అందరు ఎదురు చూశారు. అయితే సైరాకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందు సైరా ఓ బయోపిక్ అని పిటిషన్ వేసిన తమిళనాడు యువ సంఘం నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇప్పుడు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సైరా సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలని తెలియజేసింది. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఎవరు చూపించారని ప్రశ్నించింది. కల్పిత పాత్రలతో చూపిస్తున్నామంటూ గతంలో తెరకెక్కిన గాంధీజీ, మొగల్ సామ్రాజ్యంపై తెరకెక్కిన సినిమాల గురించి ప్రస్తావించింది. సినిమాను ఆపడం ఇప్పుడు కుదరదని, సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది ప్రేక్షకులకు వదిలేయాలని తెలియజేసింది. దీంతో సినిమాకు విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.