సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో మ‌రో కొరియ‌న్ రీమేక్‌..

ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేశ్‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఫీల్ గుడ్‌ సినిమాల‌ను ప‌రిచ‌యం చేసిన‌వి మ‌నం చూసాము. మంచి క్వాలీటీ ఉన్న సినిమాల‌ను అందించ‌డంలో ముందుండే నిర్మాణ సంస్థ‌ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్. కాగా తాజాగా సురేశ్ ప్రోడ‌క్ష‌న్స్ సంస్థ నుంచి మ‌రో కొరియ‌న్ మూవీ రీమేక్‌గా రానుంది. కొరియ‌న్ భాష‌కు చెందిన ల‌క్కీ కీ అనే సినిమాను అధికారికంగా రీమేక్ చేస్తున్న‌ట్టు తెలిపారు. అయితే కొరియ‌న్ ఈ చిత్రాన్ని జ‌పానీస్ నుంచి కీ ఆఫ్ లైఫ్ నుంచి తెర‌కెక్కించిన‌ట్టుగా తెలిపారు.

sureshbabu korean film remake

క్రైమ్‌తో పాటు కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రం రీమేక్ హ‌క్కుల‌ను తాము తీసుకున్నామ‌ని సురేశ్ ప్రోడ‌క్ష‌న్స్ సంస్థ వెల్ల‌డించింది. అలాగే ఒక ప్ర‌ముఖ న‌టుడిని, ప్ర‌ముఖ యంగ్ డైరెక్ట‌ర్‌ను తీసుకోనున్న‌ట్లు తెలిపారు. సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గ‌తంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఓ బేబీ చిత్రాన్ని కూడా మిస్ గ్రానీ అనే కొరియ‌న్ మూవీని రీమేక్ చేశారు సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సినిమా మంచి విజ‌యం ద‌క్కించుకుంది. ఇప్పుడు ఈ కొరియ‌న్ రీమేక్ కూడా వారికి క‌లిసొస్తుందేమో చూడాలి మ‌రీ.