అయినప్పుడు చూద్దాం.. ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు కామెంట్

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే.. ముందుగా అందిరికీ గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే లాక్‌డౌన్‌లో పలువురు టాలీవుడ్ హీరోలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రానా, నితిన్, నిఖిల్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి.

krishnamraju on prabhas marriage

ఇవాళ ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు బర్త్ డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణంరాజుని ప్రభాస్ పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభాస్ పెళ్లి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని, తాను కూడా అందుకోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. అయినప్పుడు చూద్దామంటూ కృష్ణంరాజు కామెంట్ చేశారు.