SHRUTI HAASAN: హాట్ హాట్ లుక్స్‌తో మతి పోగొడుతున్న శృతిహాసన్

SHRUTI HAASAN: కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. తన నటన, గ్లామర్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే సినిమాల్లో తన అందాలతో కుర్రకారుని పిచ్చెక్కించే ఈ అందాల బ్యూటీ.. మ్యాగజైన్ ఫొటోలతో కూడా కుర్రోళ్లలో హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే అనేక మ్యాగజైన్ల కవర్ ఫొటోలపై మత్తెక్కించే ఫొటోలతో మెరిసిన ఈ భామ.. తాజాగా కాండీమాగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది.

sruthihaasan hot photos magzine

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఫొటోలలో తన హాట్ లుక్స్‌తో శృతిహాసన్ పిచ్చెక్కించింది. ఈ వారం కాండీమాంగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ ఫొటోలు దర్శనమివ్వనున్నాయి. కాండీమాంగ్ మ్యాగజైన్ ఈ వారం శృతిహాసన్‌పై ఒక కవర్ పేజీ ఆర్టికల్ ప్రచురించనుంది. దీని కోసం కాండీమాంగ్ శృతిహాసన్ ఇంటర్వ్యూ తీసుకుంది. శృతిహాసన్ సినిమా కెరీర్, పర్సనల్ విషయాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయనున్నారు.