Maheshbabu: మ‌హేశ్‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ ప్ర‌ముఖ హీరోయిన్‌!

Maheshbabu: సూప‌ర్‌స్టార్ కృష్ణ న‌టించిన‌ గూఢచారి117 సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మ‌హేశ్‌బాబు త‌న సినీ కెరీర్‌ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా 1989 సంవ‌త్స‌రంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో కృష్ణ స‌ర‌స‌న భానుప్రియ హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మ‌హేశ్‌తో పాటు మ‌రో ప్ర‌ముఖ హీరోయిన్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. ఇంత‌కు ఆ ప్ర‌ముఖ న‌టి ఎవ‌రో తెలుసా?..

raashi, maheshbabu

అందాల న‌టి రాశి.. రాశి కూడా త‌న కెరీర్‌ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించిన విష‌యం ఈ త‌రం వారికి తెలవ‌దు. మ‌రీ ఇప్పుడు తెలిసింది క‌దా.. కానీ ఈ సినిమాలో మ‌హేశ్‌కు, రాశికి మ‌ధ్య సీన్స్ ఉండ‌వు. ఆ త‌ర్వాత మ‌హేశ్ న‌టించిన నిజం సినిమాలో గోపిచంద్ విల‌న్‌గా చేసిన విష‌యం తెలిసిందే. గోపిచంద్ భార్య‌గా రాశి కూడా విల‌న్‌గా న‌టించారు. ఈ సినిమా తేజ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కగా.. కానీ ఈ చిత్రం బాక్స‌ఫీస్ వ‌ద్ద పరాజ‌యం పాలైన మ‌హేశ్‌కు, రాశి, గోపిచంద్‌ల‌కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా తొలిసారిగా న‌టిస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్, ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.