Naga Shourya: నాగశౌర్య ‘పోలీసు వారి హెచ్చరిక’

Naga Shourya: యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లక్ష్య, వరుడు కావలెను సినిమాలు ఇప్పటికే పట్టాలెక్కగా.. త్వరలో మరో సినిమా పట్టాలెక్కనుంది. రాజ కొలుసు ఈ సినిమాను దర్శకత్వం వహించనుండగా.. ఈ సినిమా టైటిల్‌ను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

MAGASOURYA NEW MOVIE TITLE

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పోలీసు వారి హెచ్చరిక అనే టైటిల్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. రేపు ఇదే టైటిల్‌తో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని సమాచారం. ఇక నాగశౌర్య నటిస్తున్న లక్ష్య సినిమా టీజర్ జనవరి 22న 10.17 గంటలకు విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం సినిమా యూనిట్ ప్రకటించింది.