దీపావళి పండగని ముందే స్టార్ట్ చేయనున్న రజినీ…

2020 సంక్రాంతికి దర్బార్ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అన్నాత్తే. సిరుత్తయ్ శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మీనా – ఖుష్బూ – ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – రోబో శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా సెకండ్ రాకముందే అన్నాత్తే సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో, అనుకున్న సమయానికి అది పూర్తి కాలేదు. చాలా సినిమాల్లాగే అన్నాత్తే కూడా అనుకున్న టైంకి విడుదల కాదేమో అని తలైవా అభిమానులు డిసైడ్ అయిపోయారు. అయితే అందరికీ స్వీట్ సర్ప్రైస్ ఇస్తూ మేకర్స్ అన్నాత్తే మూవీని ముందు అనుకున్న డేట్ కే నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఈ విషయాన్ని చెప్తూ రజినీ ఫోటోని ట్వీట్ చేసింది సన్ పిక్చర్స్. దీపావళి లోపు కరోనా థర్డ్ వేవ్ రాకపోతే, పరిస్థితులు పూర్తిగా చక్కబడితే రజనీ టపాసుల పండగని కాస్త ముందుగానే తెచ్చిన వాడు అవుతాడు.