థ్రిల్లింగ్ ట్రైలర్ అంటే ఇలా ఉండాలి…

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత నటించిన యు-టర్న్ సినిమాతో ఆడియన్స్ ని థ్రిల్ చేసిన డైరెక్టర్ పవన్ కుమార్ నుంచి వస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘కుడి ఎడమైతే’. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్, యంగ్ హీరో రాహుల్ విజయ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ కు తగ్గట్లుగానే టీజర్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లీడ్ కాస్ట్ పైన వచ్చే సీన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. సైంటిఫిక్ క్రైమ్ థిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సీరిస్ తెలుగు డెడికేటెడ్ ఒటిటి ఆహాలో ప్రీమియర్ కానుంది. రోడ్ యాక్సిడెంట్ లో ఒక అమ్మాయి, అబ్బాయి చనిపోవడం, టీజర్ మొదట్లో మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిన సంఘటనే మళ్ళీ జరుగుతున్నట్టు అన్పించిందా ? అనే వాయిస్ రావడం, టీజర్ లో చూపించిన యాక్సిడెంట్ నే మళ్లీ చూపించడం గమనిస్తే కుడి ఎడమైతే సిరీస్ టైమ్ లూప్ నేపధ్యంలో తెరకెక్కినట్లు ఉంది. మన ఆడియన్స్ ని పూర్తిగా కొత్త కాన్సెప్ట్ అయిన ఈ టైం లూప్ నేపధ్యంలో సిరీస్ అంటే చూసే వాళ్లకి కొత్త అనుభూతి రావడం ఖాయం. టీజర్ తోనే మెప్పించిన ఈ సిరీస్ జూలై 16న ‘ఆహా’ విడుదల కానుంది.