ఇంకెంత ఛండాలం చూడాలో

బాలీవుడ్ డ్రగ్ స్కాండల్ నార్త్ నుంచి సౌత్ కి కూడా పాకింది. ఇప్పటివరకూ శాండల్ వుడ్ ని షేక్ చేసిన ఈ ఇష్యూ, ఇప్పుడు టాలీవుడ్ కి చేరింది. అయితే ఏ సంజన లాంటి వాళ్ల పేరు అయితే పెద్దగా పట్టించుకునే వారు కాదు కానీ ఈ డ్రాగ్ స్కాండల్ లో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ పేరు వినిపించడం పెద్ద దుమారమే లేపుతుంది. డ్రగ్స్ తీసుకుందన్న న్యూస్ బయటకి రాగానే నమ్రత స్పందిస్తూ ఆ వార్తలని కొట్టిపడేసింది కానీ అప్పటికే డ్రగ్స్ వార్తతో న్యూస్ ఛానెల్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. రియా చక్రవర్తి మేనేజర్ జయసాహోతో నమ్రత వాట్సాప్ చాటింగ్ చేసిందని, ఆ స్క్రీన్ షాట్స్ ఇవే అంటూ ఫొటోస్ బయటకి వచ్చాయి. డ్రగ్ పెడ్లర్స్ తో నమ్రతకి సంబంధం ఉందో లేదో ఇప్పటికైతే ఖచ్చితంగా తెలియదు కానీ ఘట్టమనేని అభిమానులు మాత్రం నమ్రతకి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ టైమ్స్ నౌ వాళ్లని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మహేశ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ డ్రగ్ స్కాండల్ లో దీపికా పదుకోన్ మేనేజర్ కి నోటీసులు ఇచ్చారు. త్వరలోనే దీపికకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు వినిపించగా తాజాగా ఈ లిస్ట్ లో దియా మీర్జా కూడా చేరింది. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ మూవీలో స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న దియా మీర్జా కూడా డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు ఎదురుకుంటుంది. ముందుగా లిస్ట్ లో చేరిన శుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా కొంతమంది బాలీవుడ్ బిగ్గీల పేర్లు చెప్పిందని గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి కానీ అవేమి నిజం కాదంటూ ఎలాంటి లిస్ట్ ప్రిపేర్ చేయలేదంటూ నార్కోటిక్స్ బ్యూరో అఫీషియల్ గానే చెప్పింది. అయితే ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే లిస్ట్ ఏమీ లేదని చెప్పారని, నార్కోటిక్స్ దెగ్గర అందరి పేర్లు ఉన్నాయని కొందరి అభిప్రాయం. మొత్తానికి సుశాంత్ సింగ్ మరణంతో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్ స్కాండల్ ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే చుట్టేసేలా ఉంది. మరి ముందు ముందు ఇంకెవరి పేర్లు వినాల్సి వస్తుందో, ఇంకెంత ఛండాలం చూడాల్సి వస్తుందో చూడాలి.