నడుము ఏంట్రా బాబు ఇలా ఉంది…

బాలీవుడ్ యూత్ కి తన గ్లామర్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌటేలా, తెలుగు కుర్రాళ్లలో కూడా హీట్ పెంచడానికి రెడీ అవుతుంది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న ఈ హాట్ బ్యూటీని బ్లాక్ రోజ్ సినిమాతో డైరెక్టర్ సంపత్ నంది తెలుగులోకి తెస్తున్నాడు. మోహన్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రేపు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ సంపత్ నంది ఒక ట్వీట్ వేశాడు, ఇందులో ప్రీలుక్ కూడా ఉంది.

బ్లాక్ రోజ్ ఫేస్ చూపించాల్సిన సమయం వచ్చిందని, రేపు సాయంత్రం 4:15 నిమిషాలకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నామని పోస్ట్ చేసిన సంపత్ నంది, ఇంకా చాలా సర్ఫరైసెస్ ఉన్నాయని చెప్పాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫొటోలో, బ్లాక్ సారీ కట్టుకోని రెడ్ రోజ్ ని బొడ్దులోకి దోపిన అమ్మాయి కనిపించింది. సారీ సంపత్ నంది అమ్మాయి ఫేస్ ని రేపే రివీల్ చేస్తాను అన్నాడు. ఇంత అందమైన నడుముకి ఉన్న మొహం ఊర్వశి రౌటేలాదే అని మనకి ఎలాగూ తెలుసు కాబట్టి రేపు ఫుల్ ఫోటో బయటకి వచ్చే వరకూ వెయిట్ చేద్దాం. అప్పటివరకూ ఈ ఫోటో చూసిన వాళ్లు మాత్రం నడుము ఎక్కడ చేయించిందిరా బాబు ఇంత సన్నగా ఉందని మహేశ్ బాబు డైలాగులు చెప్తూ ఎంజాయ్ చేస్తున్నారు.