ఆ ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరూ…

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్‌లో వేసే సెట్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఒక్కడు మూవీకి చార్మినార్, ఓల్డ్ సిటీ సెట్ వేసి నిజంగా ఒరిజినల్ లొకేషన్ లో షూట్ చేశారా అనే ఆశ్చర్యం కలిగించారు. ఒక్కడు మూవీకి ఆ సెట్ ఎస్సెట్ గా మారింది, సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే అర్జున్ మూవీలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్ అద్బుతంగా వేశారు. టెంపుల్ దగ్గరే షూట్ చేసిన అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. సరిలేరు నీకెవ్వరు మూవీ కోసం చిత్ర‌యూనిట్ కొండారెడ్డి బురుజు సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో కొండారెడ్డి బురుజు క్రియేట్ చేశారు. ఇక్కడ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నామని నిర్మాత అనీల్ సుంక‌ర ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా అనీల్ సుంక‌ర “16 ఏళ్ల క్రితం వెండితెర‌పై కొండారెడ్డి బురుజు లొకేష‌న్ ఐకాన్‌గా మారింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆ లొకేష‌న్‌కు వ‌చ్చాం. అయితే ఈసారి మ‌రింత పెద్ద‌దిగా లొకేష‌న్‌ను ఆవిష్క‌రించనున్నాం. మా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాశ్.. కొండారెడ్డి బురుజు లొకేష‌న్‌ను అద్భుత‌మైన రీతిలో తీర్చిదిద్ది రామోజీ ఫిలిమ్ సిటీలో ఆవిష్కరించారు“ అన్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దిల్‌రాజు మాట్లాడుతూ – “మ‌హేశ్‌, కొండారెడ్డి బురుజు అనే ఎపిక్ కాంబినేష‌న్ ఈ సంక్రాంతికి మీ ముందుకు రానుంది“ అన్నారు. గతంలో మహేష్ బాబు ఒక్కడు మూవీ కోసం ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లో 16 ఏళ్ల క్రితం కొండారెడ్డి బురుజు సీన్ తెర‌పై అదిరిపోయింది. అయితే ఒక్కడు సినిమాలో ఈ లొకేషన్ లో ఒక్క సీన్ మాత్రమే ఉంటుంది. ఈసారి ఒక్క సీన్ మాత్రమే కాకుండా ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్రకాశ్‌తో పూర్తి స్థాయి సెట్ వేయించి ఒక ఫైట్ తో పాటు కీలక సన్నివేశాలు తీస్తున్నారు. కొండారెడ్డి బురుజు సెట్ ముందు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిల‌బ‌డి ఉన్న ఫొటో ఘట్టమనేని అభిమానులని ఖుషి చేస్తోంది.