sunnyleone: స‌న్నీలియోన్‌కు ముంద‌స్తు బెయిల్‌..

sunnyleone: స‌న్నీలియోన్ ముందు పోర్న్‌స్టార్‌గా చిత్రాలు చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై కుర్ర‌కారును వేడేక్కించేలా ఉర్రూత‌లూగించింది స‌న్నీలియోన్‌. అయితే ఈ హాట్ బ్యూటీపై ఓ కేసు న‌మోదైంది. షియా అనే ఓ ప్ర‌ముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కోఆర్డినేట‌ర్ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యేందుకు గాను sunnyleone స‌న్నీలియోన్ దాదాపు రూ.20ల‌క్ష‌ల‌కు పైగా తీసుకుని, చివ‌ర‌కు ఆ ఈవెంట్‌కు హాజ‌రుకాకుండా, తిరిగి డ‌బ్బులు చెల్లించ‌మ‌ని అడిగితే చెల్లించ‌కుండా ఎగ్గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఇటీవ‌లే కేర‌ళ‌లోని కొచ్చి పోలీసుస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 420కింద కేసు న‌మోదు చేసి విచారించారు.

sunnyleone latest

ఈ నేప‌థ్యంలో ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను sunnyleone స‌న్నీలియోను ఖండించారు. ఈవెంట్ షెడ్యూల్ స‌రిగా ఏర్పాటు చేయ‌కుండా త‌న‌ను రెండు సార్లు అన‌వ‌సరంగా ర‌ప్పించార‌ని, ఆ రెండు సార్లు ఈవెంట్స్ జ‌ర‌గ‌లేద‌ని.. త‌న‌కు రావ‌ల్సిన డ‌బ్బులు కూడా స‌కాలంలో చెల్లించ‌లేద‌ని తెలిపింది స‌న్నీలియోన్‌. మ‌రోవైపు ఈవెంట్ కోఆర్డినేట‌ర్ మాత్రం త‌న డ‌బ్బు తిరిగి ఇవ్వాలంటూ.. ఆమెపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్ర‌యించాడు. దీంతో sunnyleone స‌న్నీలియోన్ ముంద‌స్తు బెయిల్ కోసం కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఆమెకు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక sunnyleone స‌న్నీలియ‌న్ ప్ర‌స్తుతం తెలుగులో వీర‌మ‌దేవి చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని త‌మిళ ద‌ర్శ‌కుడు వాడి ఉద‌య‌న్ డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో న‌వ‌దీప్ కూడా మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు.