అ, ఆలు తిరగేస్తున్న మాటల మాంత్రికుడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకి ఫిదా అవ్వని తెలుగు సినీ అభిమానే ఉండడు. ముఖ్యంగా ఆయన మాటల్లో, ఆయన పెట్టే టైటిల్స్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది. కాకపోతే ఆ మ్యాజిక్స్ అన్నీ అ ఆ లతోనే ముడిపడి ఉంటాయి. అతడు నుంచి మొదలుపెడితే, అత్తారింటి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వరకూ దాదాపు అన్నీ సినిమాల టైటిల్స్ ఈ అక్షరాలతోనే ఉంటాయి. ఇప్పుడు మరోసారి అ ఆ అక్షరాలని తిరగేసి పనిలో ఉన్నాడట త్రివిక్రమ్ దానికి కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు అవ్వడం విశేషం.

రీసెంట్ గా మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మూవీ అనౌన్స్ అయ్యింది. ఈ సినిమా స్క్రిప్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడిన త్రివిక్రమ్, అదే సమయంలో మంచి టైటిల్ ని కూడా ఫిక్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడట. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి అదే రోజున టైటిల్ కూడా అనౌన్స్ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి మాటల మాంత్రికుడు ఈసారి ఎలాంటి అ టైటిల్ తో వస్తాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.