ఇలియానా కొత్త అవతారం ఆ వ్యాపారం కోసమేనా…

ఇలియానా… ఈ పేరు వింటే నాజూకైన నడుముతో దాదాపు దశాబ్దం పాటు తెలుగు సినీ అభిమానులని ఫిదా చేసిన అమ్మాయి రూపం కనిపిస్తుంది. అందమే అసూయ పడేలా ఉండే ఇలియానా తెలుగులో ప్రతి టాప్ హీరో పక్కన నటించి, ఇక్కడి నుంచి బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు కానీ బాలీవుడ్ స్టార్ హీరోస్ తో అయితే నటించింది. అక్కడ మూడు నాలుగు సాలిడ్ కమర్షియల్ హిట్స్ ఉండి ఉంటే ఇలియానా క్రేజ్ మాములుగా ఉండేది కాదు. అటు తెలుగుకీ ఇటు హిందీకి దూరం అయిన ఇలియానా, ఎవరూ ఊహించని రీతిలో లావు అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. స్లిమ్ ఫిట్ అంటే కళ్ల ముందు మెదిలే ఇలియానా, ఇంత బొద్దుగా అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అలా నెమ్మదిగా ఇలియానా నుంచి ఆఫర్స్ దూరం అవ్వడం మొదలయ్యింది, ఎదో అప్పుడప్పుడూ అడపాదడపా సినిమాలు చేయడం తప్ప కంటిన్యూగా నటించినట్లేదు.

సినిమాలు తగ్గడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయిన ఇలియానా, కొత్త అవతారం ఎత్తింది. గరిటె పట్టుకుని రకరకాల వంటకాలు చేస్తుందట. ఇంట్లోనే వంటలు చేస్తున్న ఈ గోవా బ్యూటీ, అప్పుడప్పుడూ అవి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఇండస్ట్రీకి దాదాపుగా గుడ్ బై చెప్పిన ఇలియానా భవిష్యత్తులో హోటల్, రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెడుతుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. గోవాలో ఫుడ్ బిజినెస్ కి మంచి గిరాకీ ఉంది కాబట్టి ఇలియానా అక్కడ సక్సస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.