అతిలోక సుందరి మైనపు బొమ్మ…

అతిలోక సుందరిగా ప్రపంచవ్యాప్త సినీ అభిమానులందరినీ అలరించిన నటి శ్రీదేవి. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి, కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బోణి కపూర్ ని పెళ్లి చేసుకోని సినిమాలకి దూరం అయ్యింది. అలా చాలా కాలం పాటు సినిమాలకి దూరమైన శ్రీదేవి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

తన రీఎంట్రీని ఘనంగా చాటిన శ్రీదేవి, గతేడాది హఠాత్తుగా మరణించింది. సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకి కూడా శ్రీదేవి మరణం షాక్ ఇచ్చింది. ఇండియన్ లేడీ సూపర్ స్టార్ కి నివాళిగా మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ స్టాట్యూని సిద్ధం చేసింది. మిస్టర్ ఇండియా సినిమాలోని హవా హవాయి సాంగ్ లోని శ్రీదేవి లుక్ ని పోలినట్లు డిజైన్ చేసిన ఈ వాక్స్ స్టాట్యూని సింగపూర్ లో రివీల్ చేశారు. బోనీ కపూర్ తో పాటు అతని కూతుర్లు, సంజయ్ కపూర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడిన బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యారు. అభిమానుల కోసం శ్రీదేవి వాక్స్ స్టాట్యూని మరికొన్ని రోజుల పాటు సింగపూర్ లోనే ఉంచనున్నారు.