ఒక్కటవ్వనున్న ప్రేమ జంట

రణ్వీర్ దీపికా, విరాట్ అనుష్క… ఈ లిస్ట్ లో చేరడానికి మరో బాలీవుడ్ ప్రేమ జంట సిద్ధమవుతోంది. గత ఏడాదిన్నర కాలంగా ప్రేమలో ఉన్న రణబీర్ కపూర్, అలియా భట్ త్వరలో ఒక్కటవ్వనున్నారని బి-టౌన్ వర్గాల సమాచారం. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో మొదటిసారి కలిసి నటించిన ఈ జంట, ఆ తర్వాత బాహాటంగానే కలిసి మెలిసి తిరగడం మొదలు పెట్టారు. తమ ప్రేమ కహాని గురించి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఎన్ని ఆర్టికల్స్ రాసినా బయట పడని ఈ జంట, రీసెంట్ గా అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకలకి జంటగా వచ్చి ఆ సెలబ్రేషన్స్ కే హైలైట్ గా నిలిచారు.

తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ లు వచ్చే నెల గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రెండు కుటుంబాలు కలిసి జరగాల్సిన కార్యక్రమాల గురించి, పిలవాల్సిన గెస్టుల గురించి కూడా లిస్ట్ ప్రిపేర్ చేశారని సమాచారం.