నాని మరో హిట్ ఇస్తాడా?

జెర్సీ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని నాలుగు నెలలు తిరిగే లోపు గ్యాంగ్ లీడర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సినీ అభిమానులు పాజిటివ్ ఫీలింగ్ తో ఉన్నారు. ఇప్పటి వరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో గ్యాంగ్ లీడర్ సినిమాకి మంచి మార్కెట్ వచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో గ్యాంగ్ లీడర్ సినిమా బాగా బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది.

నానికి యూఎస్ మార్కెట్ లో ఉన్న బజ్ కి, విక్రమ్ కె కుమార్ మార్కెట్ కూడా కలవడంతో గ్యాంగ్ లీడర్ సినిమా అక్కడ దాదాపు 200 లొకేషన్స్ లో విడుదల కాబోతోంది. నాని కెరీర్ లోనే ఇంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన సినిమా మరొకటి లేదు. ఇప్పుడున్న బజ్ కి కాస్త పాజిటివ్ టాక్ కూడా తోడైతే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో నాని మరో హిట్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.