ఇల్లూ బేబీ రీఎంట్రీ ఇస్తుందా?

సినిమాలకి దూరంగా ఉంటూ బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పోకిరి సినిమాతో తెలుగు తెరపై మెరిసి తన అందంతో యూత్ ని ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి పక్కన నటించింది. కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లకే టాప్ చైర్ రీచ్ అయిన ఇలియానా, వీక్ స్క్రిప్ట్ సెలక్షన్ తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఇలియానా, ఇప్పుడు అక్కడ కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో సినిమాలకి దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

అమర్ అక్బర్ ఆంటోని సినిమా తర్వాత ఏ మూవీ సైన్ చేయని ఇలియాన ఒక క్రేజీ ఆఫర్ పట్టేసిందని ఫిల్మ్ నగర్ టాక్. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకి కమర్షియల్ హంగులు అద్దడంలో దిట్ట అయిన కొరటాల శివ, చిరంజీవి కలయికలో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకరకాల పేర్లు వినిపించినా కూడా కొరటాల శివ, ఇలియానాకే ఓటేశాడని తెలుస్తోంది. మరి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో ఇలియానా తన పాత మెరుపులు మళ్లీ చూపిస్తుందేమో చూడాలి.