Realhero: నిరుద్యోగుల‌కు ఈ రిక్షాలు పంపిణీ చేసిన సోనూసూద్‌!

Realhero: రియ‌ల్ హీరో సోనూసూద్ మ‌రోసారి త‌న మ‌న‌స్సును చాటుకున్నారు. నిరుద్యోగుల‌కు ఎల‌క్ట్రిక్ రిక్షాలు అందించాడు సోనూసూద్‌. సోనూసూద్ అంటేనే దేశ‌వ్యాప్తంగా ఎన‌లేని గౌర‌వంతో కూడిన అభిమానం ఉంటుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స‌కార్మికుల‌కు చేసిన సేవ‌, ఇలా ఎంతోమందికి ఆయ‌న దేవుడిలా క‌నిపించాడు. సోష‌ల్ మీడియాలో ఎవ‌రైన ఆప‌ద‌లో ఉంటే వెంట‌నే మొద‌ట‌గా స్పందించేది సోనూసూదే. దీంతో ఆయ‌న‌కు గుడి క‌ట్టారు. Realheroఆయ‌న పేరు మీద ప‌లు షాప్స్ ప్రారంభించారు.

sonu

ఇక తాజాగా త‌న స్వ‌స్థ‌ల‌మైన పంజాబ్‌లోని మోగా ప‌ట్ట‌ణంలోని ఎనిమింది మందికి నిరుద్యోగుల‌కు ఎల‌క్ట్రిక్ రిక్షాలు అందించాడుRealhero.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా 150వ‌ర‌కు ఈ రిక్షాలు పంచాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, దీనివ‌ల్ల వారికి ఉపాధి దొరుకుతుంద‌ని భావిస్తున్నాను. అలాగే ప్ర‌తిఒక్క‌రు అవ‌స‌ర‌మైన వారికి తొచినంత సాయం చేయాల‌ని పిలుపునిచ్చాడు. ఇలా సేవ చేయడానికి కార‌కులు త‌న త‌ల్లితండ్రులే అని పేర్కొన్నాడుRealhero. అందువ‌ల్ల అవ‌స‌ర‌మైన వారికి సాయం చేస్తూ.. త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తున్న‌ట్టు Realheroసోనూసూద్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో త‌న చెల్లి బావ కూడా పాల్గొన్నారు. ఇక సోనూసూద్ ప్ర‌స్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు.