సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

లాక్‌డౌన్‌లో వలస కార్మికులతో పాటు ఎంతోమందికి సహాయం చేసి సోనూసూద్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. అంతకుముందు సోనూసూద్ అంటే కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు దేశంలో సోనూసూద్ అంటేనే తెలియనివారు ఎవరూ లేరు. అంతగా తన సేవా కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. సేవా కార్యక్రమాల కోసం ఏకంగా తనకి చెందిన కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టారు.

sonusood political entry

సోనూసూద్‌కి బాగా క్రేజ్ ఉండటంతో.. ఆయన రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలని చాలా పార్టీలు ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. దీనిపై పలుమార్లు స్పందించిన సోనూసూద్.. ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో సోనూసూద్‌ని ప్రశ్నించగా.. పొలిటికల్ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం నటుడిగా తనకు మంచి కెరీర్ ఉందని, దానిని ఆస్వాదిస్తున్నానని చెప్పారు. తనకు నచ్చిన విధంగా తోటి వారికి సహాయం చేస్తున్నానన్నారు. పొలిటికల్ పార్టీల నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయని, వాటిని తాను సున్నితంగా తిరస్కరిస్తున్నానని సోనూసూద్ తెలిపారు.