పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి

తెలుగులో ‘ఫిదా’ సినిమాతో యువకులను ఫిదా చేసింది హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవి. ఆ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాల్లో నటిస్తోంది.

sai pallavi marriage

ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా నటించింది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. త్వరలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, హీరోయిన్ల పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా తన పెళ్లిపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటానని, పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవంది. తనకు పెళ్లికంటే తల్లిదండ్రులే ముఖ్యమని, తనను అర్థం చేసుకునే అబ్బాయి జీవితంలోకి వస్తే పెళ్లి గురించి ఆలోచిస్తానంది. అలాంటి అబ్బాయిలు దొరకడం చాలా కష్టమంది.

ప్రస్తుతం సోలోగానే ఉండాలని నిర్ణయించుకున్నానని, పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదని చెప్పింది. ప్రస్తుతం సాయిపల్లవి అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ సినిమాలో నటించనుంది. అలాగే సలార్ సినిమాలో ప్రభాస్‌ సరసన సాయిపల్లవి నటింనుందని ప్రాచంర జరుగుతోంది.