‘మెగాస్టార్ చిరంజీవి’ ‘ఆచార్య’ సెట్స్ కు సైకిల్ పై వెళ్లిన ‘సోనూసూద్’!!

సోనూ సూద్ .. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వెలది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆడుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్యలో సోనుసూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్ మీద వెళ్లడం విశేషం. సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయి.