రానా, సాయిప‌ల్ల‌వి ల `విరాట‌ప‌ర్వం` విడుద‌ల వాయిదా!!

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా ‘విరాట‌ప‌ర్వం`. ఈ సినిమాలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త పాత్ర‌ల‌లో రానా, సాయి ప‌ల్ల‌వి కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ సాధించింది.

90వ ద‌శ‌కంలో జ‌రిగిన య‌ధార్ధ సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవ‌న్న పాత్ర పోషిస్తున్నారు. అతను తన కలంపేరు అరణ్యగా ప్ర‌సిద్ది. సాయి పల్లవి వెన్నెల అనే పాత్ర‌లో అతని ఆరాధకురాలిగా కనిపించ‌నుంది. ఒక అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం తెర‌కెక్కుతోంది.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా వ్యాప్తి (Spike in Covid-19) కార‌ణంగా ఏప్రిల్ 30న విడుద‌ల కావాల్సిన విరాట‌ప‌ర్వం సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్‌. కొత్త విడుద‌ల తేదిని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివ‌ల్యూష‌న్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్” అనేది ట్యాగ్‌లైన్‌. డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సంయుక్తంగా సినిమాటోగ్ర‌ఫీ భాధ్యత‌లు నిర్వ‌హిస్తున్నారు, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, నివేదా పేతురాజ్‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.

తారాగ‌ణం:
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
స‌మ‌ర్ప‌ణ‌: సురేష్ బాబు
బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎస్.ఎల్‌.వి. సినిమాస్‌
సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి
స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌‌: శ్రీ‌నాగేంద్ర‌
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ చాగంటి
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: ధ‌ని ఏలే
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.