శృతిహాసన్ యార సినిమా ఓటీటీ రిలీజ్ డేట్

కరోనా దెబ్బతో గత కొన్ని నెలలుగా థియేటర్స్ మూసివేయబడ్డాయి తిరిగి రి ఓపెన్ చేసే అవకాశాలు ఇప్పట్లో కనబడడం లేదు. ఇప్పటికే పలు చిత్రాలు ఓ టి టి ద్వారా విడుదల అయ్యాయి . అయితే మన సౌత్ ఇండస్ట్రీ తో పోలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు అధికంగా ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.వచ్చేనెలలో మరిన్ని చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధం అవుతున్నాయి .

ఇటీవలే బాలీవుడ్లో శృతిహాసన్ నటించిన చిత్రం ‘యార’ కూడా ఓటీటీ ద్వారా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే .ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ zee5 వారు యారా చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేయబోతున్నారు . ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ తో ఈ చిత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది శృతి హాసన్ నటించిన సినిమా అవడంతో మన సౌత్ ఆడియన్స్ కూడా ఈ చిత్రం వైపు మొగ్గు చూపుతున్నారు.