మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది.

తాజాగా బాలీవుడ్ నటి రాచెల్ వైట్ కు కరోనా సోకింది ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలిపింది . జ్వరం దగ్గు ఉండటం తో కరోనా టెస్ట్ చేయించుకున్నాను అని, టెస్ట్ రిజల్ట్స్ లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలిందని , ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది .రాచెల్ వైట్ కోల్ కత్తా లో తన నివాసంలో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అభిమానులు మరియు నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని విషెస్ పంపుతున్నారు .