ఓ.టి.టి లే బెస్ట్ అంటున్న గోవా బ్యూటీ

Ileana

చాలా కాలంగా సినిమా ఆఫర్లు లేక ఖాళీగా ఉంటున్న గోవా బ్యూటీ ఇలియానాకి అదృష్టం ఓ టి టి రూపంలో తలుపు తట్టింది.వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందుండే ఇలియానా సినిమాలకంటే ఓ.టి.టి లే బెస్ట్ అంటూ తెగ పొగిడేస్తోంది.

ముంబై నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇలియానా నెట్ఫ్లిక్స్ మరియు ఆల్ట్ బాలాజీ వారితో ఒప్పందం చేసుకోనుంది. ఒక వెబ్ సిరీస్ లో నటించడం తో పాటు మరో వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతుంది .

ఇల్లీ బేబీ కి అటు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ ఇండస్ట్రీస్ లోనూ ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ఓ టి టి కంపెనీ వాళ్లు బారీ డీల్ ఆఫర్ చేశారని సమాచారం.