వావ్.. ఇక అంతరిక్షంలో సినిమా షూటింగ్‌లు

ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తోక్కుతోంది. మనిషి చేయగలిగే చాలా పనులు ఇప్పుడు కంప్యూటర్లు చేస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డెవలవ్ అవుతున్న కొద్దీ.. మనిషి చేయగలిగే చాలా పనులను రోబోటిక్స్‌తో చేయించుకుంటున్నారు. మనిషి భూమిని వదిలేసి అంతరిక్షంలోకి కూడా అడుగుపెడుతున్నాడు. అక్కడ జరిగే వింత, విశేషాలను భూమిపై ఉన్నవారికి తెలియజేస్తున్నారు వ్యోమగాములు. భవిష్యత్తులో మనుషులు స్పేస్‌లో కూడా ఇళ్లు నిర్మించుకుని అక్కడే జీవించే రోజులు కూడా రావొచ్చు.

space

ఇక మనకి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అందుకే స్పేస్‌లో కూడా సినిమా స్టూడియో, సినిమా షూటింగ్‌లు జరిపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ది ఛాలెంజ్’ పేరుతో స్పేస్‌లో ఒక సినిమా రూపొందిస్తున్నామని, దీనికి ప్రైవేట్ వ్యక్తులు ఫండింగ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో నటించడానికి హీరోయిన్ కోసం వెతుకుతున్నామని, అంతరిక్ష వ్యోమగామిగా మారేందుకు మానసికంగా హీరోయిన్ సిద్దమై ఉండాలన్నారు.

అంతరిక్షంలో సినిమా తీసే విషయంలో తన అవకాశాలను అసలు వదులుకోనని బోరిసోవ్ చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాల్లో మనం స్పేస్‌ను చూస్తున్నాం. కానీ వచ్చే రోజుల్లో స్పేస్‌లో కూడా సినిమా షూటింగ్‌లు జరగనున్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.