స్టార్ హోటల్‌లో దాక్కున్న హీరో

ప్రస్తుతం మానవుల జీవితాల్లో కరోనా చాలా మార్పులు తీసుకొచ్చింది. కరోనా వల్ల సామాన్య ప్రజల కంటే సినీ సెలబ్రెటీలకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వారిని ఎక్కువమంది కలుస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది టెక్నీషియన్ల మధ్య సినిమా షూటింగ్స్‌లలో పాల్గొంటూ ఉంటారు. దీంతో సెలబ్రెటీలకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడగా.. వారితో కొంతమంది కరోనా నుంచి కోలుకున్నారు. మరికొంతమందిని మాత్రం కరోనా బలి తీసుకుంది.

yash

ఈ క్రమంలో కరోనా భయంతో కేజీఎఫ్ హీరో యశ్ ఒక 7స్టార్ హోటల్‌లో దాక్కున్నాడట. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కేజీఎఫ్-2 షూటింగ్‌లో యశ్ పాల్గొన్నాడు. షూటింగ్స్‌లలో చాలామంది టెక్నీషియన్లు ఉంటారు కనుక కరోనా నిబంధనలు పాటించడం చాలా కష్టం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ 2 షూటింగ్‌లో కూడా కరోనా నిబంధనలు పాటించడం కష్టమైంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎంతోమంది నటులతో కలిసి యశ్ పనిచేయడం జరిగింది.

దీంతో డిసెంబర్ 19న షూటింగ్ ముగిసిన తర్వాత వెంటనే యశ్ కరోనా టెస్టు చేయించుకున్నాడట. టెస్టుల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే కుటుంబ సభ్యులను కలిశాడట. అంతేకాకుండా షూటింగ్‌లో పాల్గొన్న వారందరూ టెస్టులు చేయించుకోవాలని యశ్ కోరాడు. టెస్టులో నెగిటివ్ రిపోర్టు వచ్చిన అనంతరం తాజ్ హోటల్‌ వద్ద తన శాశ్వత షూట్‌లోకి వెళ్లి యశ్ తల దాచుకున్నట్లు సమాచారం. జనవరి 8న కేజీఎఫ్ 2 టీజర్ విడుదల చేయనున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ ప్రకటించింది. వచ్చే సమ్మర్‌లో దీనిని విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.