డైరెక్టర్‌ అవతారమెత్తిన పాపులర్ ఫైట్ మాస్టర్

నిర్మాతలు, రైటర్లు, హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు చేయడం కామన్. ఒక టాలెంట్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మరో టాలెంట్‌ను బయటపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్ దర్శకుడి అవతారమెత్తనున్నాడు. అతడే పీటర్ హెయిన్స్. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఫైట్ మాస్టర్‌గా ఆయన పేరు సంపాదించుకున్నాడు. బాహుబలి, రోబో లాంటి ఎన్నో పాన్ ఇండియా సినిమాల్లో తన యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు.

peter

యాక్షన్ సీన్స్ తీసే సమయంలో ఆయన ఎన్నోసార్లు ప్రమాదాల బారిన పడ్డాడు. అయినా ఆయన అవి ఏమీ పట్టించుకోడు. యాక్షన్ సీన్స్ అద్భుతంగా తీసేందుకు ఎంత రిస్క్‌నైనా ఫేస్ చేస్తాడు పీటర్ హెయిన్స్. తన యాక్షన్ సీన్స్‌తో హీరోల హీరోయింజని బయటకి తీసుకొస్తాడు. అలాంటి టాలెంటెండ్ ఫైట్ మాస్టర్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోనున్నాడు.

బ్యాక్సింగ్ నేపథ్యంలో ‘సామ్ హోయి’ అనే సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2017లో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు అన్నీ సమస్యలను అధిగమించి సినిమాను పీటర్ హెయిన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. వియత్నాంతో పాటు ఇండియా, చైనాలలో ఈ సినిమా రిలీజ్ కానుందది.