రండి.. తెలుగువారి సత్తాను మరోసారి చాటి చెబుదాం..

నందమూరి తారకరామరావు. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఆయన. తెలుగు ప్రజలు ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనను ఒక దేవునిగా కోలుస్తారు. ఇంట్లోని దేవుని గుడిలో ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుని కొలుస్తున్న వారు కోట్లాది మంది ఉన్నారు. తెలుగువారి సత్తాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఆయనకు అభిమాని కాని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల పేరు వింటే చాలు.. తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఆయన పేరు వింటే చాలా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుమూలల చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌.

NTR

అప్పట్లో ఎన్టీఆర్ చెన్నైలో నివాసం ఉండే సమయంలో.. తిరుపతి వెళ్లిన ప్రతిఒక్కరూ శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వెంటనే చెన్నై వెళ్లి ఎన్టీఆర్‌ను చూసి తిరిగి ఇంటికి వచ్చేవారు. ఇలా రోజూ లక్షలాది మంది ప్రజలుఎన్టీఆర్ దర్శనం కోసం ఇంటి వద్ద గంటల కొద్దీ వెయిట్ చేసేవారు. జనాలు ఎన్టీఆర్‌ను ఎంతగా ఇష్టపడేవారో దీనిని బట్టి చూస్తే తెలుసుకోవచ్చు.

రాముడి అనే పేరు వినగానే తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. సినిమాల్లో ఎన్టీఆర్ రాముడి పాత్రలో ఉన్న లుక్‌ను చూస్తే అచ్చం రాముడిని చూసినట్లే ఉంటుంది. సినిమాల్లో టాప్ హీరోగా ఎన్నో సంవత్సరాలు కొనసాగిన ఎన్టీఆర్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చి తన పాలనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆయన పథకాలను ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారంటే.. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో ఎంతగా నిలిచిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ సంస్థ ఇండియాలోనే ఎప్పటికీ గొప్ప నటుడు ఎవరనే దానిపై ఒక పోల్ పెట్టింది. దేశంలో పాపులర్ అయిన 30 మంది నటుల పేర్లు ఇచ్చి.. ఇందులో 10 మంది గొప్ప నటులు ఎవరు? అని పోల్ పెట్టింది ప్రస్తుతం ఈ పోల్ కొనసాగుతుండగా.. కన్నడ నటుడు రాజ్‌కుమార్, ఎన్టీఆర్ 13 శాతం ఓట్లతో సరిసమానంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు ఓట్లు వేసి తొలిస్థానంలో నిలబెట్టాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతోంది. ప్రతిఒక్కరూ మీరు ఓటు వేయడమే కాకుండా ఫ్రెండ్స్, బంధువులతో ఓట్లు వేయించాలని కోరుతున్నారు.

మొబైల్‌లో ఒకసారి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని, దీంతో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల నుంచి కూడా ఓటు వేయాలని కోరుతున్నారు. తెలుగువారి ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్‌ను తొలి స్థానంలో నిలబెట్టాలని అనుకుంటున్నారా?.. అయితే ఇక ఆలస్యం ఎందుకు?.. ఈ కింది లింక్ ఓపెన్ చేసి ఓటు వేసి తెలుగువారి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పండి. ఓటు వేసేందుకు కింది లింక్ ఓపెన్ చేసి ఎన్టీఆర్ పేరుపై క్లిక్ చేయండి

https://in.style.yahoo.com/tell-us-who-are-indias-10-greatest-actors-of-all-time-114636532.html