మహేష్ SVP: విలన్ రోల్ కోసం హీరోలు కావాలట..

విలన్స్ అనే పదానికి నేటితరం నటులు సరికొత్త అర్దాన్ని చెబుతున్నారు. హీరోగానే కాకుండా కొందరు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు చాలా ఈజీగా ఒప్పుకుంటున్నారు. ఇక త్వరలో మహేష్ బాబు సినిమాలో కూడా ఒక సీనియర్ హీరో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సర్కారు వారి పాట (SVP) సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాలో విలన్ పాత్ర చాలా బలంగా ఉండాలని దర్శకుడు కొంతమంది సీనియర్ హీరోల లిస్ట్ ని తయారు చేసినట్లు టాక్ వస్తోంది. ఆ లిస్ట్ లో తమిళ్ హీరో అరవింద్ స్వామితో పాటు కన్నడ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని దర్శకుడు మహేష్ బాబుతో చర్చలు జరుపుతున్నారట. ఇక ఇప్పట్లో షూటింగ్ స్టార్ చేసే అవకాశం లేదు కాబట్టి ఈ విషయంలో తొందరపడకుండా నిదానంగా ఆలోచుకోవాలని మహేష్ టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.