విడుదలకు ముందే రికార్డు సృష్టించిన ‘సర్కారు వారి పాట’

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న సర్కారు వారిపాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు మహేష్ ఇటీవల దుబాయ్‌కి బయలుదేరాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మహేష్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

SARKAR VARI PATA

ఇప్పుడు విడుదల కాకముందే సర్కారు వారి పాట సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ట్విట్టర్‌లో తాజాగా సర్కారువారి పాట సినిమా రికార్డు సృష్టించింది. ట్విట్టర్‌లో ప్రస్తుతం సర్కారు వారి పాట హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్ 100 మిలియన్ మార్క్‌ను అందుకుంది. దీంతో 100 మిలియన్ మార్క్‌ను అందుకున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది.