Saalar: స‌లార్‌పై వ‌స్తున్న పుకార్ల‌పై డైరెక్ట‌ర్ క్లారిటీ..

Saalar: యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇక స‌లార్ సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి దాని గురించి ఏదో ఒక వార్త నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా ఈ వార్త‌ల‌పై డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా భారీ యాక్ష‌న్ బ్యాక్‌గ్రాండ్‌తో రాబోతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌లే టైటిల్‌తో పాటు ప్ర‌భాస్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌గా.. ఆ ఫోటోలో క‌నిపిస్తుంది భారీ యాక్ష‌న్ సినిమా అని..

prabhas saalar

ఈ మూవీని ప్ర‌శాంత్‌నీల్ కేవ‌లం నాలుగు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట డైరెక్ట‌ర్‌.. ఈ క్ర‌మంలోనే Saalar స‌లార్ సినిమా ఏ మూవీకి రీమేక్ కాద‌ని, అదేవిధంగా కేజీఎఫ్ క‌థ‌ను రాసే స‌మ‌యంలోనే ఈ సినిమా క‌థను రాసుకున్నాన‌ని తెలిపాడు. ఇక Saalar ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ చిత్రంలో న‌టిస్తుండ‌గా.. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ స‌లార్ షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.. కాగా త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.