మాల్దీవుల్లో భర్తతో సమంత రచ్చ రచ్చ

హీరోయిన్స్ అందరూ మాల్దీవుల బాట పట్టారు. ఒకవైపు సినిమాలతో పాటు టాక్ షో చేస్తూ బిజీబిజీగా ఉన్న హీరోయిన్ సమంత.. ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని తన భర్త హీరో నాగచైతన్యతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా చైతూ-సమంతల జంట మాల్దీవుల పర్యటనకు వెళ్లింది. అక్కడ తమ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్యామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయ్యాయి. ఇంకా అక్కడే ఉండటంతో మరిన్ని ఫొటోలను సమంత షేర్ చేసే అవకాశముంది. ఈ ఫొటోలను చూసిన స్యామ్ అభిమానులు.. సూపర్‌గా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇవాళ నాగచైతన్య పుట్టినరోజు కావడంతో అక్కడే ఈ జంట బర్త్ డే సెలబ్రెట్ చేసుకోనుంది.

ప్రస్తుతం పలు సినిమాలకు సైన్ చేసిన సమంత.. మరోవైపు ఆహా యాప్‌లో స్యామ్ జామ్ టాక్ షో చేస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ ఇందులో పాల్గొనగా.. త్వరలో చిరంజీవి, అల్లు అర్జున్, తమన్నా పాల్గొననున్నారు. ఇటీవలే కాజల్, తాప్సి, రకుల్ ప్రీత్ సింగ్ మల్దీవుల్లో ఎంజామ్ చేసిన విషయం తెలిసిందే