‘సల్మాన్ ఖాన్’ హిందీ ‘బిగ్ బాస్ 14’ మొదలయ్యేది ఎప్పుడంటే?

ఇండియన్ బిగ్గెస్ట్ హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కి ప్లాన్ సెట్టయ్యింది. గత 13 సీజన్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగాయి. ఇక ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా కఠిన సమయాల్లో షోను నిర్వహించాల్సి వస్తోంది. తెలుగులో నాగార్జున చాలా డేరింగ్ గా షోను స్టార్ట్ చేశారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా అదే తరహాలో రెడీ అవుతున్నాడు.

అక్టోబర్ 3నుంచి షో టెలిక్యాస్ట్ కానుందని సమాచారం. ఇక ఈ సారి హిందీ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది హాట్ టాపిక్ మారింది. చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నాయి గాని ఇంకా ఫైనల్ లిస్ట్ పై నమ్మకం కలగడం లేదు. సింగర్ గానే కాకుండా యాక్టర్ గా మోడల్ గా తనకంటూ ఒక ప్రతి షెహ్నజ్ గిల్ ఈ సారి మొదటి కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.