పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది వినగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడేమో అని అనుకుంటున్నారా?.. అవును.. నిజంగా ఆయన పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టాడు. కానీ రియల్ లైఫ్‌లో కాదు. ఒక సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రాజకీయ అవతారమెత్తాడు. ‘తండవ్’ అనే పొలిటికల్ డ్రామా సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

SAIF ALI KHAN

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో పొలిటికల్ లీడర్ పాత్రలో చాలా పవర్‌ఫుల్‌గా సైఫ్ కనిపించాడు. ఇండియాలోని రాజకీయ పరిస్థితులపై ఈ సినిమా తీసినట్లు టీజర్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ప్రధానమంత్రి చుట్టూ రాజకీయాలు నడుస్తాయని, ప్రధాని ఎవరైతే అవుతారో… వారు మాత్రమే రాజుగా వెలుగుతారనే యాంగిల్‌లో సినిమా తెరకెక్కించారు.

ప్రధాని పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్లుగా టీజర్‌లో చూపించారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 15న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.