తెలుగులోనూ విజయ్‌ హవా

కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్‌కు తమిళంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో టాప్ హీరోగా కొనసాగుతున్న విజయ్‌.. అత్యధికమంది ఫ్యాన్ ఫాయింగ్ కలిగిన హీరోలలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక తమిళంలోనే కాదు.. సౌతిండియాలోనే విజయ్‌కు భారీ క్రేజ్ ఉంది. దీంతో ఆయన సినిమాలను సౌతిండియాలోని అన్ని భాషల ప్రేక్షకులు చూస్తారు. తమిళమే కాదు తెలుగు, మలయాళం భాషల్లో కూడా విజయ్ సినిమాలు డబ్ అవుతున్నాయి. అలా డబ్ అయిన చాలా సినిమాలు విజయం సాధించాయి.

VIJAY

ప్రస్తుతం తమిళ ‘ఖైదీ’ సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘మాస్టర్’ అనే సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయి విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. త్వరలో రానున్న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించగా.. ఇటీవలే ‘మాస్టర్’ తమిళ టీజర్ విడుదలైంది.

ఈ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించగా.. తాజాగా తెలుగు టీజర్ కూడా విడుదలైంది. ఇక తెలుగు టీజర్ కూడా అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. దీంతో ఈ సినిమాపై తెలుగు అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.