‘అవెంజర్స్’ డైరెక్టర్‌తో ధనుష్ సినిమా

ఇండియన్ సినిమా హీరోలు హాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్‌ హాలీవుడ్‌లో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి కూడా హాలీవుడ్‌లో మరో ఆఫర్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ధనుష్‌కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులోనూ ఆయన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ధనుష్ సినిమాలు చాలా నేచురల్‌గా ఉంటాయి. అంతేకాకుండా తన సినిమాల్లో ధనుష్ చాలా సింఫుల్‌గా కనిపిస్తూ ఉంటాడు. సౌతిండియాలో అందరికీ సుపరిచితమైన ధనుష్‌కు హాలీవుడ్‌లో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

DHANUSH

ఇప్పటికే ‘ది ఎక్స్‌ట్రార్డరనీర జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే హాలీవుడ్ సినిమాలో ధనుష్ నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. దీంతో ధనుష్‌కి హాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్ నిర్మిస్తోన్న ‘ది గ్రే మెన్’ సినిమాలో ధనుశ్ ముఖ్యపాత్రలో నటించడానికి సైన్ చేశాడు. ఇందులో ధనుశ్ సరసన జెస్సీకా హెన్‌విక్ నటిస్తున్నారు.

ఇక రియాన్ గోలింగ్, క్రస్ ఎవాన్స్, అనాదే అర్మాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాను తెరకెక్కించిన రుస్సో బ్రదర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.