పవన్‌కి భార్యగా సాయిపల్లవి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సితార ఎంటన్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి మాటలు అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

PAWANS WIFE ROLE SAIPALLVI

ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో పవన్‌కి భార్యగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించనుంది. ఈ పాత్ర నడివి తక్కువగా ఉన్నా.. దీని కోసం పాయిపల్లవి ఫుల్ పేమెంట్ తీసుకోనుందట. దాదాపు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్‌ను సాయిపల్లవి డిమాండ్ చేసిందని టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. సాయిపల్లవి డిమాండ్‌క తగ్గట్లుగా అంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఒకే చెప్పారట.