నారప్ప’ పూర్తైంది

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ‘నారప్ప’ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని వెంకటేష్ తన ట్విట్టర్‌లో తెలిపాడు. ‘ఇవాళ నారప్ప షూటింగ్ పూర్తైంది. ఈ సినిమా చూడటానికి వెయిట్ చేయండి’ అని వెంకటేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

NARAPPA SHOOTING WRAPPED

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు అనేక అవార్డులు వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ సినిమాను నిరర్మిస్తన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ప్రియమణి, ప్రకాశ్ రాజ్, మురళీశర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు.