‘RRR’ షూటింగ్ మళ్ళీ మొదలయ్యేది ఎప్పుడంటే..?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న బిగెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా షూటింగ్ లాక్ డౌన్ లోనే ఆగిపోయింది. ఇక తదుపరి షెడ్యూల్ గురించి చిత్ర యూనిట్ ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం. దసరా పండుగ రోజు తర్వాత RRR యొక్క షూట్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందట. షూటింగ్‌కు ముందు హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సెట్స్‌ను ఈ బృందం మరోసారి శుభ్రపరుస్తుందతట. తదుపరి షెడ్యూల్‌లో చాలా మంది విదేశీ నటులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్నట్లు టాక్. వీలైనంత వరకు తక్కువమంది యూనిట్ సభ్యులతోనే సినిమా షూటింగ్ ని కొనసాగించాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడు.