‘అనుష్క’ చేసిన సహాయం మర్చిపోలేను : ‘తమన్నా’

స్టార్ హీరోయిన్ తమన్నా మూడు పదుల వయసును దాటినా కూడా ఇంకా పదహారేళ్ళ పడుచు పిల్లలనే దర్శనమిస్తోంది. మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ స్టార్ యాక్టర్ ఇతర హీరోయిన్స్ తో కూడా చాలా ఫ్రెండ్లిగా ఉంటుంది. తోటి స్టార్ హీరోయిన్స్ అయిన కాజల్, శ్రుతి హాసన్, అనుష్క వంటి వారు తనకు మంచి స్నేహితులని చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది.

ఇక టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనుష్క శెట్టి కూడా తనకు ఎంతో సహాయం చేసిందని తాజా ఇంటర్వ్యూలో తమన్నా బయటపెట్టింది. “నేను టాలీవుడ్‌ లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినప్పుడు, నా దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ కూడా లేడు. అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఇక అనుష్క నా పరిస్థితులను అర్థం చేసుకొని కాస్ట్యూమ్ విషయంలో నాకు చాలా సహాయం చేసింది. ఇప్పుడు కూడా, నాకు ఏదైనా అవసరమైనప్పుడు నేను పిలిచే మొదటి స్నేహితురాలు అనుష్క. ఆమె నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. బహుబలితో అనుష్కతో భాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది” అని తమన్నా మాట్లాడారు.