‘కుక్క’ను దత్తత తీసుకున్న ‘విజయ్ దేవరకొండ’.. ఫొటోస్ వైరల్!!

టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులను అకట్టుకోవడంలో సరికొత్తగా ఆలోచిస్తాడని చెప్పవచ్చు. ప్రతి సినిమా కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇక ఈ స్టార్ హీరో రియల్ లైఫ్ లో చేసే పనులు కూడా ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఇటీవల విజయ్ దేవరకొండ ఒక పెంపుడు కుక్కను దత్తత తీసుకున్నాడు. ప్రతిరోజూ ఆ డాగ్ తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు.

విజయ్ దేవరకొం రెండు పెంపుడు జంతువుల పెంచుకుంటున్నారు వాటిలో ఒకదానికి స్ట్రామ్ అని, మరొక దానికి చెస్టర్ అని పేరు పెట్టాడు. విజయ్ పెంపుడు జంతువులతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవితున్నాయి. పూరీ జగన్నాథ్ కార్యాలయంలో కుక్కలతో గడిపిన సమయం తనను కూడా ఇంటికి తీసుకువెళ్ళిందని ఈ నటుడు వెల్లడించాడు. ఇక విజయ్ స్టార్మ్ మరియు చెస్టర్ రెండింటి కోసం ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్స్ ని కూడా తెరిచాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.