బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 1800కోట్లు కొల్లగొట్టి, తెలుగు సినిమా సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళి, మరోసారి బాక్సాఫీస్ దుమ్ముదులపడానికి సిద్దమవుతున్నాడు. ఎన్టీఆర్, చరణ్ లని పెట్టి ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్న జక్కన్న అక్టోబర్ 13 న వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. హీరోలుగా మాస్ గాడ్స్ ఎన్టీఆర్, చరణ్… హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివా మోరిస్… సపోర్టింగ్ రోల్ లో అజయ్ దేవగన్. ఈ కాస్టింగ్ చూస్తేనే భారీ మార్కెట్ రావడం ఖాయం, ఇక వీరికి రాజమౌళి స్టాంప్ కూడా పడితే ఆ మార్కెట్ రేంజ్ బాహుబలిని దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
థియేట్రికల్ బిజినెస్ కి ఇంకా టైం ఉంది కానీ ఈలోపు పోస్ట్ బిజినెస్ ని రాజమౌళి కంప్లీట్ చేశాడట. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ ని రికార్డు స్థాయిలో అమ్ముడైయ్యాయట. ‘ఆర్ఆర్ఆర్’ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.325 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వెర్షన్స్ హక్కులు, ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజిన్స్ కలిపి మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.900 కోట్లకు చేరుకుందని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ కి ఖర్చు పెట్టిన మొత్తం ఈ పోస్ట్ రిలీజ్ బిజినెస్ తోనే రాజమౌళి రిటర్న్ తెచ్చాడు. మరి ఓవరాల్ బిజినెస్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలి అంటే అక్టోబర్ వరకూ ఆగాల్సిందే.