Rgv-Nag: ఆర్‌జీవి పోస్ట్‌.. నాగార్జున ఫ్యాన్స్ చూస్తే అంతే సంగ‌తులు..

Rgv-Nag: వివాదాల ద‌ర్శ‌కుడు ఎవ‌రు అంటే ట‌క్కున రాంగోపాల్ వ‌ర్మ అని పేరు చెబుతారు. అంత‌లా ఆయ‌న వ్యాఖ్య‌లు గానీ, ఫోటోలు గాని, మ‌రీ ఏదైనా విష‌యంలోనైనా కాంట్ర‌వ‌ర్సీ చేయ‌కుండా ఉండ‌లేరు. కానీ ఇప్పుడు ఆయ‌న సోష‌ల్ మీడియాలో పెట్టిన తాజా ఫోటోకు నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఫిదా అయిపోతున్నారు. ఇంత‌కీ ఆయ‌న పెట్టిన ఫోటో ఏంటీ అనుకుంటున్నారా? నాగార్జున బాల‌న‌టుడిగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే.

rgv post

త‌న తండ్రి నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి మొద‌టి సారి సుడిగుండాలు అనే మూవీలో న‌టించారు నాగార్జున‌. ఈ చిత్రంలోని ఒక సీన్‌కు సంబంధించిన ఫోటోను ఆర్‌జీవి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు సుడిగుండాలు స‌న్నివేశం, చంద్ర‌శేఖ‌రం ఆయ‌న కుమారుడిని స్కూల్‌కి కారులో తీసుకెళ్లారు. అంటూ కామెంట్ చేశాడు ఆర్‌జీవి. ప్ర‌స్తుతం ఆర్‌జీవి పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో నాగార్జున ఫ్యాన్స్ ఆ ఫోటోను చూసి ఎంతో ఫిదా అవుతున్నారు.