మోనాల్ సేవ్ కావడానికి అదే కారణమా?

ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు వారందరికీ మోనాల్ సుపరిచితమైంది. అంతకుముందు పలు తెలుగు సినిమాల్లో ఆమె నటించినా.. పెద్దగా ఎవ్వరికీ తెలియదు. బిగ్‌బాస్‌లో ఇంగ్లీష్, తెలుగు కలిపి ఆమె మాట్లాడే మాటలు ఎవ్వరికీ అర్థం కావు. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కొంచం కొంచెం తెలుగు నేర్చుకుంటోంది. అఖిల్, అభిజిత్‌తో మోనాల్ నడిపే ప్రేమాయణం గురించి మనందరికీ తెలిసిందే.

monal

ప్రేక్షకుల్లో మోనాల్‌పై పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ లేదు. అయినా ఆమె ప్రతివారం సేవ్ అవుతూనే వస్తుంది. దీని కారణం బిగ్‌బాస్ కావాలనే మోనాల్‌ను సేవ్ చేస్తున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే గత వారం మోనాల్ సేవ్ కావడానికి అభిజిత్, హారిక ఫ్యాన్స్ కారణమనే చర్చ జరుగుతోంది. గత వారం మోనాల్, హారిక వల్ల అభిజిత్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.

దీంతో అభిజిత్, హారిక ఫ్యాన్స్ మోనాల్‌కి ఎక్కువ ఓట్లు వేశారని, దీని వల్ల మోనాల్ సేవ్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోనాల్ టాప్ 5లో ఉండే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ మరో మూడు వారాలు మాత్రమే ఉండటంతో టాస్కులు మరింత కఠినంగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఈ మూడు వారాల్లో పెర్ఫామెన్స్‌ను బట్టే బిగ్‌బాస్ విన్నర్, రన్నర్ ఎవరనేది తెలిసిపోతుందని అంటున్నారు.