సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రవితేజ సినిమా?

మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన ఈగల్ ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉన్న ఇతర సినిమాల ప్రొడ్యూసర్స్ తో ఒప్పందం కారణంగా మూవీ వాయిదా వేసుకున్నారు.

ఫిబ్రవరి 8న సింగిల్ డేట్ ఇవ్వాలని పీపుల్స్ మీడియా నిర్మాతలు రిక్వెస్ట్ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న టిల్లు స్క్వేర్ మూవీని వాయిదా వేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మరో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ రవితేజతో ఒక మూవీ చేయనున్నట్లు ప్రకటించింది.

రవితేజ పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్ సితార పోస్టర్ విషెస్ చెప్పి మూవీని ఎనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది క్లారిటీ లేదు. నిర్మాత నాగవంశీ చాలా మంది దర్శకులతో మూవీస్ చేయడానికి అడ్వాన్స్ లు ఇచ్చి ఉన్నారు. వారిలో ఎవరో ఒకరితో మూవీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అది ఎవరనేది అఫీషియల్ గా చెప్పాల్సి ఉంటుంది. రవితేజ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. దీని తర్వాత జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

అలాగే ఇద్దరు, ముగ్గురు కొత్త దర్శకులు కూడా రవితేజతో సినిమా చేయడం కోసం లైన్ లో ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాల వరకు రవితేజ రిలీజ్ చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. సితారలో చేయబోయే సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది వేచి చూడాలి.